Guvvala Balaraju Political Move: కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు
ABN , Publish Date - Aug 08 , 2025 | 10:53 AM
Guvvala Balaraju Political Move: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఇంటికి గువ్వల వెళ్లారు గువ్వల బాలరాజు. తార్నకలోని ఇంట్లో రాంచందర్ రావు, గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. బీజీపీలో గువ్వల చేరికను రాంచందర్ రావు అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇవాళ (శుక్రవారం) తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఇంటికి గువ్వల వెళ్లారు. తార్నకలోని ఇంట్లో రాంచందర్ రావు, గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. బీజీపీలో గువ్వల చేరికను రాంచందర్ రావు అధికారికంగా ప్రకటించారు. గువ్వల ఈనెల 10వ తేదీన కమలం పార్టీలో చేరనున్నారు. ఆయనతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
బీఆర్ఎస్‌ను వీడి.. సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్‌ను గువ్వల బాలరాజు వీడిన తర్వాత ఆ పార్టీపై బుధవారం నాడు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపుతానంటూ వేలాది ఫోన్లు వచ్చాయని, ఇంత జరిగినా బీఆర్ఎస్‌లో ఎవ్వరూ తనను పట్టించుకోలేదని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ కేసులో వంద కోట్లకు అమ్ముడుపోయానంటూ తనపై అబాండాలు మోపారని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల ప్రకారమే తనకు ఇచ్చిన రోల్‌ను ఫాంహౌస్‌లో పోషించానని, ఆ విషయం పార్టీ పెద్దలకూ తెలుసని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
టైర్ పంక్చర్ స్కామ్.. రూ.8 వేలు నష్టపోయిన వ్యక్తి, ఎలాగో తెలుసా..
మాజీసీఎం సంచలన కామెంట్స్.. పెట్టుబడులపై సీఎం చెప్పేవన్నీ అసత్యాలే