EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. పెట్టుబడులపై సీఎం చెప్పేవన్నీ అసత్యాలే
ABN , Publish Date - Aug 08 , 2025 | 09:33 AM
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెచ్చిన పెట్టుబడుల వ్యవహారాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పేవన్నీ అసత్యాలేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
- ఈపీఎస్ విమర్శ
చెన్నై: రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెచ్చిన పెట్టుబడుల వ్యవహారాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) చెప్పేవన్నీ అసత్యాలేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) విమర్శించారు. ఆయన గురువారం డీఎంకే ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ తన ఎక్స్‌పేజీలో పోస్టు చేసిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించకుండా ప్రకటనలకే పరిమితమైన డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మెరుగుపరచకుండా ప్రజలను మభ్యపెట్టేలా అసత్యాలు చెబుతోందని ఈపీఎస్ దుయ్యబట్టారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పథకాల గురించి ఆలోచించకుండా ఫొటో షూట్లు నడిపి కేంద్రప్రభుత్వ పథకాలకు సిక్కర్లు అంటించి తమవని చెప్పుకోవడంలో సీఎం నుంచి మంత్రుల వరకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు.

మార్చి 17వ తేదీ నాటికి ఆర్థిక పురోగతిలో రాష్ట్ర వార్షికాదాయం, రాష్ట్ర అభివృద్ధి 9.12 శాతంగా గణించబడిందని, ఇది ఈ నెల 1వ తేదీ నాటికి 11.19 శాతంగా పెరిగిందని, అయితే గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పెరిగిన ఆర్థిక ప్రగతి గురించి డీఎంకే ప్రభుత్వం మాట్లాడటంలేదని ఈపీఎస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
Read Latest Telangana News and National News