Home » Home Minister Anitha
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
దిత్వా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులను హోంమంత్రి అనిత అలర్ట్ చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు.
దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రతీ వీఐపీ బాధ్యత తమదే అని పేర్కొన్నారు.
కల్పిత వీడియోల ద్వారా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు . రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందేలా చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి వద్ద ఆటో-టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్నాయి.
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరమన్నారు.
సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
కోనసీమ జిల్లాలో అక్టోబర్ 8వ తేదీన బాణాసంచా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు.
తాను వస్తున్నానని తెలిసి బయట నుంచి వ్యక్తులు కూడా వచ్చారని హోం మంత్రి అనిత తెలిపారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.