Home Minister Anitha: హోం మంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించి!

ABN, Publish Date - Nov 03 , 2025 | 03:25 PM

ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు . రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందేలా చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి వద్ద ఆటో-టాటా మ్యాజిక్‌ వాహనాలు ఢీకొన్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందేలా చేసి.. రాష్ట్ర హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు . అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి వద్ద ఆటో-టాటా వాహనాలు(Road Accident,) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో వైజాగ్ నుంచి పాయకరావుపేట వెళ్తున్న మంత్రి అనిత(Home Minister Anitha) .. క్షతగాత్రులను చూసి చలించిపోయారు. తక్షణమే గాయపడిన వారిని తన కాన్వాయ్‌ వాహనాల్లో సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులకు అవసరమైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను మంత్రి అనిత పరామర్శించారు.


ఇవి కూడా చదవండి...

జోగి రమేష్ కుటుంబసభ్యులు, అనుచరులపై కేసు నమోదు

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated at - Nov 03 , 2025 | 03:31 PM