Share News

Home Minister Anitha: అలా చేస్తే కఠిన చర్యలు.. పోలీసులకు హోంమంత్రి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 09:18 PM

కీలక కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Home Minister Anitha: అలా చేస్తే కఠిన చర్యలు.. పోలీసులకు హోంమంత్రి కీలక ఆదేశాలు
Home Minister Vangalapudi Anitha

అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కీలక కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరస్థులు అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఇవాళ(శనివారం) ఏపీ క్రైమ్ రివ్యూ సమావేశం ఏపీ సచివాలయంలో జరిగింది. అలాగే, నేరాల నివారణపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత,‌ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఏడాదిలో నమోదైన నేరాలు, వాటిపై విధించిన శిక్షలు, కేసుల పురోగతిపై సమీక్షించారు. నేరాల నియంత్రణ, కేసుల త్వరగా పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సైబర్ క్రైమ్, క్రిప్టో కరెన్సీ దుర్వినియోగం, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన నివారణ చర్యలపై సూచనలు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది అధికారులను హోం మంత్రి అనిత సన్మానించారు.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం

జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 09:24 PM