Share News

Vangalapudi Anita: మేం అలా చేస్తే మీరు రోడ్డు మీద తిరుగుతారా?.. వైసీపీకి అనిత స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:55 PM

పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెంమంత్రి అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.

Vangalapudi Anita: మేం అలా చేస్తే మీరు రోడ్డు మీద తిరుగుతారా?.. వైసీపీకి అనిత స్ట్రాంగ్ కౌంటర్
Vangalapudi Anita

ప్రకాశం, డిసెంబర్ 22 : మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) స్పందిస్తూ.. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా తయారైందని వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయిస్తూ నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడడం పోలీసులకు ఒక ఎత్తైతే... రౌడీ మూకలను కంట్రోల్ చేయటం సవాలుగా మారిందని అన్నారు.


పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. గతంలో గంజాయి హబ్‌గా ఉన్న ఏపీని గంజాయి రహితంగా మార్చేందుకు ఈగల్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయి వద్దని గత ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికైనా జగన్ హాజరయ్యారా అని ప్రశ్నించారు. గంజాయి సాగుని జీరో‌కు తీసుకువచ్చామని తెలపారు. ఎవరైనా గంజాయి రవాణా చేసినా పట్టుకుని కేసులు పెడుతున్నామన్నారు. రౌడీమూకల ఆటలు కూడా కట్టడి చేస్తామని వెల్లడించారు.


వైసీపీ నాయకులు ఎవరిపైనా తాము కక్షలు పెట్టుకోలేదని.. తాము కక్ష సాధింపుకు పాల్పడితే వైసీపీ నాయకులు రోడ్డుపై తిరుగుతారా అని నిలదీశారు. బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

వీఎంఆర్డీఏలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు.. టెన్షన్ టెన్షన్

విజయవాడలో మరిన్ని జాతీయ పోటీలకు కృషి: ఎంపీ శివనాథ్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 01:02 PM