MP Kesineni Shivanath: విజయవాడలో మరిన్ని జాతీయ పోటీలకు కృషి: ఎంపీ శివనాథ్
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:35 PM
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 78వ జాతీయ అంతర్ రాష్ట్ర, 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీ ప్రారంభించారు.
విజయవాడ, డిసెంబర్ 22: రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 78వ జాతీయ అంతర్ రాష్ట్ర, 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath) ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 28 వరకు యోనెక్స్ సన్రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లు జరగడం గర్వకారణమన్నారు.
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం జాతీయ–అంతర్జాతీయ పోటీలకు అనుకూలంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఆధునీకరణ చేశామన్నారు. యోనెక్స్ సన్రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లు యువ క్రీడాకారులకు మంచి వేదిక అని చెప్పుకొచ్చారు. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ వంటి స్టార్ షట్లర్ల పాల్గొనడం యువతకు ప్రేరణ అని తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీలను విజయవాడకు తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
కాగా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవి నాయుడు, స్వచ్ఛంద్రా కార్పొరేషన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు
వీఎంఆర్డీఏలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు.. టెన్షన్ టెన్షన్
Read Latest AP News And Telugu News