Share News

Food Poison at Uppada: ఉప్పాడ తీర ప్రాంతంలో ఫుడ్ పాయిజన్.. 8 మందికి అస్వస్థత

ABN , Publish Date - Dec 22 , 2025 | 10:39 AM

ఉప్పాడలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అక్కడి ఓ హోటల్లో ఆహారం సేవించిన 8 మంది మత్స్యకారులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం బయటపడింది.

Food Poison at Uppada: ఉప్పాడ తీర ప్రాంతంలో ఫుడ్ పాయిజన్.. 8 మందికి అస్వస్థత
Food Poisoning Scare at Uppada

కాకినాడ జిల్లా, డిసెంబర్ 22: ఉప్పాడ(Uppada) ప్రాంతంలో విషతుల్య ఆహారం కలకలం రేపింది. తీర ప్రాంతానికి చెందిన కొందరు మ్యత్సకారులు(Fishermen) అస్వస్థతకు గురవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. వివరాల్లోకెళితే...


ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన 8 మంది మత్స్యకారుల సమూహం ఇటీవల చేపల లోడింగ్(Fishes Loading) కోసం బైరవపాలెం వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఆకలేసి తాళ్లరేవు సమీపంలో గల ఓ హోటల్లో బిర్యానీ ఆరగించారు. ఫుడ్ పాయిజన్(Food Poisoning) కావడంతో.. అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని యు.కొత్తపల్లి(U.Kothapalli) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం(Pithapuram) గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే.. అక్కడి వైద్యులు వీరిని పరీక్షించిన తర్వాత ప్రమాదమేమీ లేదని నిర్ధారించారు. దీంతో బాధితులు సహా వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం.. వారు పిఠాపురంలో చికిత్స పొందుతున్నారు.


ఇవీ చదవండి:

రైలు టికెట్ల ధరల పెంపు!

బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు

Updated Date - Dec 22 , 2025 | 10:41 AM