IPS Officer Ammi Reddy: ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు
ABN , Publish Date - Dec 22 , 2025 | 01:48 PM
ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు అందాయి. మంగళవారం మధ్యాహ్నం హాజరు కావాలని అందులో పేర్కొంది.
అమరావతి, డిసెంబర్ 22: ఐపీఎస్ ఆఫీసర్ అమ్మిరెడ్డికి రాష్ట్ర శాసన మండలి సోమవారం నోటిసులు పంపింది(IPS Officer Ammi Reddy). ఆయన.. గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)ను కించపరిచేలా ట్వీట్ చేశారనే కారణంతో ఈ నోటీసులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.
శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ(Legislative Council Privilege Committee) మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. అదే సమావేశంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ప్రివిలేజేస్ కమిటీ.
ఇవీ చదవండి: