Share News

Tourism Summit on Tirupati: పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Sep 12 , 2025 | 07:45 AM

తిరుపతిలో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన శుక్రవారం జరుగనుంది. పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఈ సమ్మిట్‌లో వివరించనున్నారు.

Tourism Summit on Tirupati: పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
Tourism Investors Summit on Tirupati

అమరావతి/తిరుపతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Regional Tourism Investors Summit) మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఇవాళ(శుక్రవారం) జరుగనుంది. పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఈ సమ్మిట్‌లో వివరించనున్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇన్వెస్టర్స్‌తో, హోమ్ స్టే ఆపరేటర్స్‌తో ప్రత్యేకంగా మంత్రి దుర్గేష్ చర్చించనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో ఈ సమ్మిట్‌ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీటీడీసీ అధికారులు.


ఏపీలో పర్యాటక రంగాన్ని (Tourism Sector) బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగనుంది. కొత్త పెట్టుడుల ప్రతిపాదన, తిరుపతిని కొత్త ఎంఐసీఈ గమ్యస్థానంగా ప్రోత్సహించడం, కారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, హోమ్ స్టే, అడ్వెంచర్ టూరిజం, ఎక్స్ పీరియన్స్ సెంటర్స్‌తో టూర్ ప్యాకేజీల అనుసంధానం, టూరిజం కొత్త పాలసీపై ఈ సమ్మిట్‌లో చర్చించనున్నారు.


కూటమి ప్రభుత్వంపై నమ్మకం, మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కృషితో 15 నెలల కాలంలో పర్యాటక రంగంలో రూ.10,644 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య , జిల్లా అధికార యంత్రాంగం, పలువురు ఇన్వెస్టర్స్ పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 12 , 2025 | 10:31 AM