Horticulture Department: ఉద్యానశాఖలో పోస్టింగ్‌లు
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:06 AM
ఉద్యానశాఖలో ఇటీవల డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి పొందిన పలువురికి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. కమిషనరేట్‌లోని పీఎన్‌వీ లక్ష్మీనారాయణను విజయనగరం జిల్లా...
ఉద్యానశాఖలో ఇటీవల డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి పొందిన పలువురికి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. కమిషనరేట్‌లోని పీఎన్‌వీ లక్ష్మీనారాయణను విజయనగరం జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, నెల్లూరు ఎంఐపీ పీడీ బి.శ్రీనివాసులును డిప్యుటేషన్‌పై అమరావతి అభివృద్ధి సంస్థకు, ఏపీ ఇరిగేషన్, ప్రస్తుతం లైవ్లీహుడ్ ప్రాజెక్ట్‌లో ఉన్న కె.సజానాయక్‌ను ఏలూరు జిల్లా ఉద్యాన అధికారిగా, పశ్చిమగోదావరి ఉద్యాన అధికారి జి.ప్రభాకర్‌రావును డైరెక్టరేట్‌కు బదిలీ చేసింది. కడప ఏపీఎంఐపీలో ఏడీ వెంకటేశ్వరరెడ్డిని అక్కడే డీడీగా, టెక్కలి ఉద్యానశాఖ ఏడీ చిట్టిబాబును విజయనగరం జిల్లా ఉద్యాన అధికారిగా, తిరుపతి ఏపీఎంఐపీలో ఏడీ సతీష్‌ను కడప జిల్లా ఉద్యాన అధికారిగా నియమించింది.