Home » Kandula Durgesh
విశాఖ సమ్మిట్ ద్వారా 50వేల ఉద్యోగాలు వస్తాయని భావించామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లిబర్డ్ ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తున్నామని తెలిపారు.
ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్‌లో పర్యటిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకృతి అందాలను అభివృద్ధి చేయడం ద్వారా నేడు అద్భుతమైన ప్రదేశాలుగా మారాయని వివరించారు. పర్యాటక రంగంలో సుస్థిరమైన మార్పు వచ్చిందని చెప్పడానికి ఏపీ ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
తిరుపతిలో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన శుక్రవారం జరుగనుంది. పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఈ సమ్మిట్‌లో వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సమావేశం కానున్నారు. ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరుగనుంది. తెలుగు ఫిలింఫెడరేషన్ స్ట్రైక్, వారి సమస్యలపై ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్‌తో ప్రధానంగా చర్చించనున్నారు.
సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని, ఇది ఫిల్మ్ ఛాంబర్‌కు సంబంధించిన వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశం అయ్యారు.
అత్యుత్తమ విధానాలతో ఏపీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీ చాలా బాగుందని మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు.
Minister Durgesh On RK Beach: గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.