Share News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై సబ్ కమిటీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:23 PM

రుషికొండ ప్యాలెస్ వినియోగానికి సంబంధించి టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు.

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై సబ్ కమిటీ కీలక నిర్ణయం
Rushikonda Palace

అమరావతి, డిసెంబర్ 16: రుషి కొండ గత సీఎం తన నివాసం కోసం ఏర్పాటు చేసుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) అన్నారు. రిషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యింది. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. రుషికొండ ప్యాలెస్ మెయింటెనెన్స్‌ కోసం ప్రతి నెల రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోందని మంత్రి పయ్యావుల అన్నారు.


ఇప్పటికే టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు. రుషికొండ పేరుతో ఎంత ప్రజా ధనం వృథా చేశారో.. దానిపై ప్రజల నిరసన ఎలా వచ్చిందో చూశామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. టూరిజంకు ఆదాయం వచ్చేలా చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పటికే కొందరు ముందుకు వచ్చారన్నారు. వాళ్లకు ఎలా వయబుల్ అవుతాయో చూడాలని తెలిపారు. మరోసారి చర్చించి రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ముందుకు వెళతామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


సచివాలయంలో జరిగిన భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీ టీఏ సీఈఓ ఆమ్రపాలి కాట, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి

ఆరోగ్య వ్యవస్థలో మార్పులు ఖాయం: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 04:59 PM