Satya Kumar Yadav: ఆరోగ్య వ్యవస్థలో మార్పులు ఖాయం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:09 PM
ఆరోగ్య వ్యవస్థను పటిష్టత చేసే యోచనలో ముందుకు వెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు.
అమరావతి, డిసెంబర్ 16: రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకురావడం జరుగుతుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 10 వ్యాధులను మ్యాపింగ్ చేసి ఎక్స్‌పర్ట్స్ ఆలోచనలకు అనుగుణంగా ట్రీట్‌మెంట్ చేయటం జరుగుతుందని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ ఎక్స్‌పర్ట్స్‌తో ఉండే శాస్త్రవేత్తలు ఈ గ్రూప్‌లో ఉన్నారని తెలిపారు. దేశ విదేశాలలో ఉన్న ఈ సైంటిస్ట్‌లు వర్చువల్ విధానంలో మొదటి సమావేశానికి హాజరయ్యారన్నారు. వ్యక్తిగత చికిత్స అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ ఎక్స్‌పర్ట్స్ గ్రూప్ పనిచేస్తుందని అన్నారు. ఆరోగ్య వ్యవస్థను పటిష్టత చేసే యోచనలో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు.
కోటి సంతాకాల సేకరణపై...
ఇక.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై మంత్రి స్పందించారు. కోటి సంతకాల రాద్ధాంతం మొదలైందని.. ఇది కోడి గీతల కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. సుపరిపాలన యాత్రలో ఎవరు కూడా కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనలేదని తెలియజేశారు. లక్షల మందిలో కనీసం ఒక్కరు కూడా సంతకం చేసిన దాఖలు లేవన్నారు. గ్రామ, పట్టణ, కళాశాలలో కానీ పేదలలో ఎలాంటి చర్చ లేదన్నారు. కార్యకర్తలకు సంతకాలు పెట్టి చేతులు వాసిపోతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
కాగా.. ఈరోజు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ఈ సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి
Read Latest AP News And Telugu News