Rammohan Naidu: సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి
ABN , Publish Date - Dec 16 , 2025 | 02:54 PM
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు అవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరికొద్ది నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందని.. మరో నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు.
విశాఖపట్నం, డిసెంబర్ 16: విశాఖ ప్రపంచానికే కేంద్రంగా తయారవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) అన్నారు. ప్రస్తుతం ఏవియేషన్ బాగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. మనదేశంలో ఏవియేషన్ అభివృద్ధి చెందుతుందంటే ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని తెలిపారు. ప్రతి ఏటా 12 శాతం గ్రోత్ రేట్‌తో ఏవియేషన్ రంగం ఎదుగుతోందన్నారు. సాధారణ వ్యక్తి విమానంలో ప్రయాణం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని తెలిపారు. భవిష్యత్‌లో ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్య ఎనిమిది వేలకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు అవుతుందన్నారు.
సీఎం చంద్రబాబు ఆలోచనలు నుంచి పుట్టినది ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అని చెప్పుకొచ్చారు. మరికొద్ది నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందని.. మరో నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ విశ్వవిద్యాలయాలకు జీఎంఆర్ - మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కేంద్రంగా ఉంటుందని కేంద్రమంత్రి చెప్పారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ కోసం ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వస్తారన్నారు. ఉత్తరాంధ్రలో పూసపాటి కుటుంబం ఉండడం అందరి అదృష్టమన్నారు. కోట్ల విలువచేసే భూమిని పూసపాటి కుటుంబం విద్యకు ఇస్తున్నారని తెలిపారు.
ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి 136 ఎకరాల భూమిని ఇచ్చారని అన్నారు. భవిష్యత్ తరాలకు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విమానయాన రంగంలో ట్రైనింగ్ కెపాసిటీ ఇంకా పెరగాల్సి ఉందని.. దీనికి జీఎంఆర్ - మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన
సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News