Share News

మావోయిస్టుల పేరుతో లేఖ.. మంత్రి కందుల దుర్గేశ్ రియాక్షన్..

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:13 PM

ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మావోయిస్టుల పేరుతో లేఖ.. మంత్రి కందుల దుర్గేశ్ రియాక్షన్..
AP Minister Kandula Durgesh

అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.


మంత్రి కందుల దుర్గేశ్‌ స్పందన..

మంత్రి కందుల దుర్గేశ్‌(AP Minister Kandula Durgesh) ఈ ఘటనపై స్పందిస్తూ.. మావోయిస్టులు లేఖ రాయాల్సినంత హడావిడి ఏముంది? అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా, శాఖ పరంగా తామెలాంటి తప్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారన్నారు. ఈ లేఖతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారన్న ఆయన.. అధికారుల దర్యాప్తుతో అసలు నిజం వెలుగులోకి వస్తుందని చెప్పారు. మంత్రుల భద్రతాపరమైన అంశాలపై కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మంత్రి కందుల దుర్గేశ్‌ వ్యక్తిగత సహాయకుడు.. ఈ బెదిరింపు లేఖపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 01:09 PM