’జల్ జంగిల్ జమీన్’ స్ఫూర్తితో అరకును అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:54 PM
అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు..
అరకు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) అన్నారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు. అరకు ఉత్సవ్ -2026లో మంత్రులు కందుల దుర్గేశ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. అరకు ఉత్సవ్‌లో కళాకారులను మంత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడారు. ‘జల్ జంగిల్ జమీన్’ స్ఫూర్తితో అరకును పర్యావరణహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు.
బొర్రా గుహలను అభివృద్ధి చేస్తున్నాం..
స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా రూ.29.88 కోట్లతో బొర్రా గుహలనుే అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అత్యాధునిక లైటింగ్, ఫ్లోరింగ్, ప్రొజెక్ట్ మ్యాపింగ్, సేఫ్టీ రెయిలింగ్స్, పార్కింగ్, విజిటర్స్ ఎమినిటీస్, రెస్టారెంట్స్, సావనీర్ షాప్స్, ఈవీ బగ్గీలు, పర్యాటక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో అరకును అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రూ. 42.30 కోట్లతో హరిత రిసార్ట్స్ ఆధునికీకరణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అరకు హరిత యాత్రి నివాస్‌లో గదుల సంఖ్యను పెంచామని తెలిపారు. 40 నుంచి 60కి, మయూరి రిసార్ట్‌లో 65 నుంచి 98కి, తైడ జంగిల్ బెల్స్‌లో 13 నుంచి 26కు గదుల సంఖ్యను పెంచామని స్పష్టం చేశారు.
జీవనోపాధి పెంచేందుకు చర్యలు..
అరకు, పాడేరు, లంబసింగిలో 60 హోమ్ స్టేలను గుర్తించినట్లు తెలిపారు. స్థానికంగా జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. అరకు కాఫీ తోటలను పర్యాటకంతో అనుసంధానం చేసి గిరిజన రైతులకు మరింత లాభం చేకూర్చేలా 'కాఫీ ఎక్స్ పీరియన్స్ సెంటర్స్' ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఒక పర్యాటక ఉపాధి లక్ష్యంతో రాబోయే పదేళ్లలో ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి పర్యాటక రంగంలో ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత
Read Latest AP News And Telugu News