Share News

రాజ్యాంగ విలువలు కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం: మంత్రి దుర్గేశ్

ABN , Publish Date - Jan 26 , 2026 | 02:08 PM

రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే స్ఫూర్తితో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, నవ భారతావనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగ విలువలు కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం: మంత్రి దుర్గేశ్
Kandula Durgesh

అమరావతి, జనవరి 26: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశభక్తి స్ఫూర్తి, జాతీయ గర్వంతో నిండిన గణతంత్ర దినోత్సవం మన అద్భుతమైన చరిత్రను గుర్తు చేస్తుంది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను, న్యాయం, స్వేచ్ఛను అందించింది. సోదర భావంతో ఐక్యతను చాటుదాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పాటుపడదాం’ అని పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలు ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తాయన్నారు. స్వేచ్ఛను ఆస్వాదిద్దామని.. కానీ దాని కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన సూచించారు.


గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, నవ భారతావనిలో భాగస్వామ్యం కావాలని మంత్రి దుర్గేశ్ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. ‘మన దేశం మన గర్వం. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులను కాపాడుతూ, గౌరవిస్తూ బాధ్యత గల పౌరులుగా మెలగాలి. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ.. శాంతి, సౌభాగ్యాల భారతావని కోసం మనమంతా పునరంకితమవుదాం. గణతంత్ర భారతాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేద్దాం’ అని మంత్రి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

ప్రజల విశ్వాసమే మా బలం.. వారి భద్రతకే తొలి ప్రాధాన్యం: సీపీ సజ్జనార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 03:13 PM