Kandula Durgesh: విశాఖ సమ్మిట్‌తో 50 వేల ఉద్యోగాల అవకాశాలు: మంత్రి కందుల దుర్గేష్
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:39 PM
విశాఖ సమ్మిట్ ద్వారా 50వేల ఉద్యోగాలు వస్తాయని భావించామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లిబర్డ్ ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తున్నామని తెలిపారు.
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ ఎస్ఐపీబీ సమావేశం ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) వివరించారు. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో కూడా భారీగా ఎంవోయూలు జరిగాయని గుర్తుచేశారు. పెద్దఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ఈ 18 నెలల్లో ఇచ్చామని తెలిపారు మంత్రి కందుల దుర్గేశ్.
రూ.20,440 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని అన్నారు. 26 సంస్థలు తమ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరించాయని వివరించారు. విశాఖ సమ్మిట్ ద్వారా 50వేల ఉద్యోగాలు వస్తాయని భావించామని అన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లిబర్డ్ ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంవోయూలు సరైన దిశలో అమలు చేయడానికి సీఎం, మంత్రివర్గ ఉపసంఘం, మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నింటిని వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ప్రెజంట్ చేయడానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. ఇన్నిపెట్టుబడులు రావడానికి కారణం తమ ప్రభుత్వానికి పెరిగిన క్రెడిబిలిటీనే కారణమని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ఎనర్జీ సెక్టర్‌లో 40శాతం ఎంవోయూలు: మంత్రి టీజీ భరత్

ఎనర్జీ సెక్టర్‌లో 40శాతం ఎంవోయూలు జరిగాయని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఎంవోయూలు ఫాలోఅప్‌కు ఇవాళ(గురువారం) రివ్యూ జరిగిందని తెలిపారు. పోర్టల్‌లో ఎంవోయూలు అప్‌లోడ్ చేశామని.. ఇవీ ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటికప్పడు తెలిసేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లే లోపు వీలైనన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. జనవరి 18వ తేదీలోగా గ్రౌండ్ చేయడం ద్వారా రూ. 1000 కోట్ల పెట్టుబడి ఏపీకి వస్తే వారికి ఓ ఆఫీసర్ ప్రత్యేకంగా ఫాలోఅప్ అవుతారని చెప్పుకొచ్చారు మంత్రి టీజీ భరత్.
ప్రపంచం మొత్తంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసే గూగుల్‌కు ఒక బజ్ వచ్చిందని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. విశాఖపట్నం సమ్మిట్‌లో 30శాతం గ్రౌండ్ అయితే ఏపీ అద్బతాలు సాధించినట్లేనని వివరించారు. ఈ పరిశ్రమలు అన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిందేనని చంద్రబాబు ఆదేశించారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News