Cultural Festival: ఘనంగా వెంకటగిరి జాతర
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:19 AM
తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు భక్తజనం భారీగా తరలివచ్చారు. ఆలయం వద్ద వేప మండలతో పందిరి వేసి గురువారం వేకువజామున...
తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు భక్తజనం భారీగా తరలివచ్చారు. ఆలయం వద్ద వేప మండలతో పందిరి వేసి గురువారం వేకువజామున అమ్మవారి ప్రతిమను కొలువు తీర్చారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నవధాన్య మొలకలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పోలేరమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా విరూప మండపానికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో శివాలయం వద్ద అమ్మవారి ఆభరణాలు తీసేశారు. మండపం వద్ద అమ్మవారి ప్రతిమను విరూపం చేయడంతో జాతర ముగిసింది. విగ్రహం మట్టిని భక్తులు తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు.
- వెంకటగిరి, ఆంధ్రజ్యోతి