Lokesh Counter To YS Jagan: టీచర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా.. జగన్ అండ్ కోపై లోకేష్ ధ్వజం
ABN , Publish Date - Sep 05 , 2025 | 09:34 AM
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.
అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు నారా లోకేష్. ‘ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ.. విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానం. మన సమాజంలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువును పూజిస్తాం. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి నారా లోకేష్
ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అతి నీచంగా చిత్రీకరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ విషయాలను ప్రచారం చేసే వైసీపీ చర్యలను అర్థం చేసుకుని తగిన రీతిలో స్పందించాల్సిందిగా టీచర్లను కోరుతున్నానని అన్నారు మంత్రి నారా లోకేష్.
వైసీపీ తన ఫేక్ హ్యాండిల్‌లో నేడు ఒక ఫొటోను షేర్ చేసిందని... ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో అతి జుగుప్సాకరంగా అందులో వ్యాఖ్యానం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చిన ఫొటోను ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు చెప్పడం, దానిపై దారుణంగా వ్యాఖ్యానించడం క్షమించరాని నేరమని హెచ్చరించారు. ఇలాంటి నేరాలను ఇప్పటికే చాలాసార్లు వైసీపీ చేసిందని ధ్వజమెత్తారు. విద్యను నేర్పే గురువులపైనా అతి నీచంగా వ్యవహారించిన వైసీపీ నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు కిందికి దిగజారిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
మహమ్మద్ ప్రవక్త బోధనలు సదా ఆచరణీయం..
మిలాద్ ఉన్ నబీ చేసుకుంటున్న ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మహమ్మద్ ప్రవక్త బోధనలు సదా ఆచరణీయం. సర్వశక్తివంతుడైన అల్లా ఆశీర్వాదం మీకు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
Read Latest Andhra Pradesh News and National News