Share News

విధ్వంసకర రాజకీయాలకు జగనే మూల కారణం: యనమల రామకృష్ణుడు

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:54 AM

రాష్ట్రంలో నేర రాజకీయాలకు వైఎస్ జగన్, ఆయన అనుచరులే కారణమని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.

విధ్వంసకర రాజకీయాలకు జగనే మూల కారణం: యనమల రామకృష్ణుడు
Yanamala Ramakrishnudu On YS Jagan

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్.. రాజకీయ ఆయుధాలుగా ప్రతీకారం, గూండాయిజం, నేరపూరిత కుట్రలనే ఉపయోగిస్తున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని చెబుతున్న జగన్, ఆయన అనుచరులు.. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని మాట్లాడటం పూర్తిగా రాజకీయ కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అధికారం కోల్పోయినా.. నేర రాజకీయాలు

రాష్ట్రంలో జరుగుతున్న అశాంతి, నేర కార్యకలాపాలకు జగన్, ఆయన అనుచరులే ప్రధాన సృష్టికర్తలని యనమల ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతీకార రాజకీయాలతో ప్రత్యర్థులను అణచివేసేందుకు ఇలాంటి చర్యలే చేపట్టిందని గుర్తు చేశారు. అధికారం కోల్పోయాక కూడా అదే విధమైన నేర రాజకీయాలను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.


జగనే మూల కారణం..

ప్రజాస్వామ్య వ్యవస్థపై జగన్‌కు ఎప్పుడూ నమ్మకం లేదని, విధ్వంసకర రాజకీయాలకు ఆయనే మూల కారణమని వ్యాఖ్యానించారు. శాసనసభ లోపల, వెలుపల.. సీఎం చంద్రబాబుపై జగన్ అనుచరులు అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలచే ఎన్నికోబడిన నాయకుడిగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే ధైర్యం జగన్‌కు లేదని యనమల ఎద్దేవా చేశారు.

అధికారం చేజిక్కించుకోవాలనే..

శాంతిభద్రతలు విఫలమయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తూ, బలవంతంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు యనమల. వైసీపీ వర్గ రాజకీయ ప్రవర్తన.. రాష్ట్రాన్ని మాఫియా కార్యకలాపాలకు కేంద్రంగా మార్చే ప్రమాదముందన్నారు. జగన్ రాజకీయాల్లోని నీచత్వాన్ని ప్రజలు గమనించాలని యనమల రామకృష్ణుడు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 12:48 PM