Share News

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. కార్మికుడు మృతి

ABN , Publish Date - Feb 02 , 2026 | 10:40 AM

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పనులు చేస్తుండగా ప్రమాదవశత్తూ భారీ రాతిబండ ఎగిరి పడటంతో రాజమాల్ అనే కార్మికుడు అక్కడిక్కడే మృతిచెందాడు.

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. కార్మికుడు మృతి

కర్నూలు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదోని డివిజన్ కపటి గ్రామ శివారులోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం.. ఓ వలస కూలీ ప్రాణాన్ని బలిగొంది. గ్రానైట్ ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్న సమయంలో అనుకోని రీతిలో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఫ్యాక్టరీలో గ్రానైట్ రాళ్లను ప్రాసెస్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ భారీ రాతి బండ ఒక్కసారిగా ఎగిరి కార్మికుడిపై పడింది. బండరాయి బలంగా తగలడంతో సదరు కార్మికుడు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. మృతిచెందిన కార్మికుడిని రాజమాల్‌గా గుర్తించారు. ఆయన ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికుడని సహచర కార్మికులు తెలిపారు.


పోలీసుల దర్యాప్తు..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆదోని రూరల్ పోలీసులు.. తక్షణమే ఫ్యాక్టరీకి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు లోపించాయా లేదా అనే కోణంలో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు. ఫ్యాక్టరీలు, మైనింగ్ ప్రాంతాల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 10:59 AM