Share News

Yanamala: రౌండ్ టేబుల్ సమావేశంపై యనమల మండిపాటు

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:52 PM

Yanamala: రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పని చేసే సిబ్బందికి వర్తించదా.. అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైఎస్ పాలనలో, జగన్ హయాంలో మీడియా వాచ్ పేరుతో నాటి ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకురాలేదా అని నిలదీశారు.

Yanamala: రౌండ్ టేబుల్ సమావేశంపై యనమల మండిపాటు
Yanamala Ramakrishnudu

Amaravati: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి అనుకూలంగా భావ ప్రకటనా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం (Round Table Meeting) నిర్వహించడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు (TDP Leader) యనమల రామకృష్ణడు (Yanamala Ramakrishnudu) అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ సంపాదకులమంటూ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురిపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛను హరించినప్పుడు సోకాల్డ్ సీనియర్ సంపాదకులు నిద్రపోయారా.. అంటూ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం, అవమానాలకు గురి చేసే వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం వంటివి భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకి రావని అన్నారు.


రూల్ ఆఫ్ లా వారికి వర్తించదా..

రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పని చేసే సిబ్బందికి వర్తించదా.. అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైఎస్ పాలనలో, జగన్ హయాంలో మీడియా వాచ్ పేరుతో నాటి ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకురాలేదా అని నిలదీశారు. నాడు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినట్టు కాదా అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఇంకొన్ని టీవీ ఛానెళ్లను నాటి ప్రభుత్వాలు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదా.. నాటి ప్రభుత్వాల తీరు భావ ప్రకటనా స్వేచ్ఛకు.. ఆర్టికల్ 19(1)కు విరుద్దంగా లేదా.. రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న సోకాల్డ్ సంపాదకులు నాడు నిద్ర పోయారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా నాటి ప్రభుత్వాలు వ్యవహరిస్తే నాడు ఎందుకు తప్పు పట్టలేదని అన్నారు. అధికారం కొల్పోయిన తర్వాత కూడా సాక్షి పత్రిక, ఆ ఛానెల్ ప్రజా ప్రతినిధులను అవమానించేలా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయని, సాక్షి మీడియా తన దుష్ప్రచారంతో పరిపాలనకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూనే ఉందని యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


జగన్ అక్రమాస్తులు ఇడుపులపాయలోనే..

కాగా మాజీ సీఎం జగన్‌ అక్రమ ఆస్తులను ఇడుపులపాయలోని బంకర్లలోనే దాచిపెట్టారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వారం రోజుల క్రితం కాకినాడ జిల్లా, తుని మండలం, తేటగుంట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు దినం అంటూ జగన్‌ తన అవినీతి పత్రికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని, జగన్‌ కుట్రలను కూటమి నేతలు తిప్పికొట్టాలని పిలుపిచ్చారు. వెన్నుపోటు పొడవటం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని.. తల్లి, చెల్లిని రోడ్డుపైకి ఈడ్చారని, బాబాయి వివేకా హత్యతో జగన్‌ నేర చరిత్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, పేదలకు కూటమి ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మిస్తుంటే జగన్‌కు కడుపు మంట ఎందుకని యనమల ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి:

ఎయిరిండియా విమాన ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

తెలుగు రాష్ట్రాల్లో జలవివాదం...

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 15 , 2025 | 12:58 PM