Home » Pressmeet
అమరావతి: మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాధుడే లేడని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
హైదరాబాద్: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఆచరిస్తోందని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు.
అమరావతి: పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్ధిక సహకారం మంజూరు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్‌ను గురువారం ఉదయం జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
విజయవాడ: మాజీ ఎంపీ హర్షకుమార్ శుక్రవారం ఏపీ గవర్నర్‌ను రాజ్ భవన్లో కలిసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం గేమ్ ఆడుతోందని, సబ్ ప్లాన్ నిధులు మళ్లించి వాటిని నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అమరావతి: తెలంగాణలో పోలింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కొత్త కుట్రకు తెరలేపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
అమరావతి: ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్‌ను కలిసామని మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాను వైసీపీ నేతలు కలిసారు.
ఖమ్మం జిల్లా: సిపిఐ తెలంగాణ రాష్ట్ర ప్రజల విముక్తి కోసం పోరాడుతోందని, ఈ ఎన్నికలలో ఒక్క సీటు తీసుకుని 118 సీట్లలో సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషిచేస్తున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు.
అమరావతి: కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్యకు సీఎం జగన్ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైద్యుడి తల్లికి వైసీపీ గూండాలు బెదిరించడం దుర్మార్గమన్నారు.