Somireddy: వైసీపీ పేరు తీసేసి రప్పా రప్పా అని పెట్టుకోవాలి..
ABN , Publish Date - Jun 25 , 2025 | 02:09 PM
Somireddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా, టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని, ఇచ్చిన అనుమతికి మించి 9 గంటలు ర్యాలీ చేశారని దుయ్యబట్టారు.

Nellore: టీడీపీ సీనియర్ నేత (TDP Leader), మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Ex Minister Somireddy Chandramohan Reddy).. వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్ (Ex CM Jagan)పై తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. దళిత సోదరుడు సింగయ్యది, జగన్ చేసిన హత్యలేనని అన్నారు. ర్యాలీలో కాన్వాయ్ కింద పడితే తొక్కేసి వెళ్లిపోయారని విమర్శించారు. కనీసం దిగి బాధితుడిని ఆస్పత్రికి కూడా తరలించలేదని, సింగయ్యది ముమ్మాటికీ హత్యని సోమిరెడ్డి ఆరోపించారు.
ముళ్లకంపల్లో పడేసి వెళ్ళిపోతారా..
తీవ్రంగా గాయపడిన సింగయ్యను ముళ్లకంపల్లో పడేసి వెళ్ళిపోతారా.. అంటూ జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇచ్చిన అనుమతికి మించి 9 గంటలు ర్యాలీ చేశారని, సీఎంగా జగన్ ఉన్నప్పుడు, బెట్టింగ్‌ల్లో డబ్బలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే, విగ్రహాలు పెడతారా.. అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ పేరు తీసేసి రప్పా రప్పా పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు. అలాగే గొడ్డలిని పార్టీ సింబల్‌గా పెట్టుకోవాలన్నారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. జగన్ లాంటి వారి వల్ల దళితులు, గిరిజనుల ప్రాణాలకు హానీ కలుగుతోందన్నారు. ఈ దేశ చరిత్రలో రూ. 43 వేల కోట్ల కుంభకోణంలో జగన్ నిందితుడని సోమిరెడ్డి అన్నారు.
90 కిలోమీటర్ల రోప్ పార్టీని పెట్టాలా..
జగన్ పర్యటనలో 679 మంది పోలీసులను పెడితే ఇంకా బందోబస్తు సరిపోలేదని విమర్శలు చేస్తున్నారని, 90 కిలోమీటర్ల రోప్ పార్టీని పెట్టాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్‌కు సిగ్గూ శరం ఉండాలన్నారు. జగన్ కోసం వచ్చిన అభిమానిని నిలువునా ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. ఆయన కారులో ఉన్న పెద్దరెడ్డి కారు కింద పడితే అలాగే వదిలేసి వెళుతారా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని, జగన్ తీసుకున్న అనుమతి ఒకటి.. చేసింది మరొకటని విమర్శించారు. జగన్ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఒక సీఎం అనుకుంటే ఎంత అవినీతి చేయోచ్చో.. మద్యం కుంభకోణాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు.
సిట్ అధికారులు మొత్తం బయటకు తీస్తారు..
జగన్ మద్యం కుంభకోణం రూ.3,200 కోట్లు అని, సిట్ అధికారులు మొత్తం బయటకు తీస్తారని సోమిరెడ్డి అన్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని, చనిపోయిన ఓ వ్యక్తిని పరామర్శించడానికి 96 కిలోమీటర్ల ర్యాలీనా అని ప్రశ్నించారు. షర్మిలా రెడ్డి తన సోదరుడు జగన్‌పై బాగానే పోరాడుతున్నారని, అభినందనీయమని అన్నారు. అయితే.. యాభై ఏళ్ల వెనక్కి వెళితే... కాంగ్రెస్ తెచ్చిన ఎమర్జెన్సీ చరిత్ర తెలుసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి:
సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు
కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు
For More AP News and Telugu News