Share News

DBV Swamy: జగన్ అండ్ కో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.. మంత్రి ఫైర్

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:29 PM

జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

DBV Swamy: జగన్ అండ్ కో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.. మంత్రి ఫైర్
Dola Sri Balaveeranjaneya Swamy

ప్రకాశం, జనవరి4(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి (Dola Sri Balaveeranjaneya Swamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం లేని ఆరోపణలు చేయటం జగన్ అండ్ కో నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు అందరూ చూశారని చెప్పుకొచ్చారు. ఇవాళ(ఆదివారం) ప్రకాశం జిల్లాలో మంత్రి డీబీవీ స్వామి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డీబీవీ స్వామి.


పోలీసులను అడ్డం పెట్టుకుని ఏపీలో జగన్ అండ్ కో ఏమైనా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొదిలి ఘటనపై వెంటనే స్పందించామని తెలిపారు. ఆ ఎస్సైను వెంటనే ప్రభుత్వం వీఆర్‌కు పిలిచిందని అన్నారు. టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వెళ్లి బాధితులను పరామర్శించారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో మాట్లాడి ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి.


జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభిస్తుంటే చప్పట్లు ఎలా కొట్టారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంతో గతంలో మీరు మోసం చేశామని అంగీకరిస్తున్నట్లేనా అని నిలదీశారు. తమ ప్రభుత్వంలో ప్రోటోకాల్ ప్రకారమే అన్నీ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 04 , 2026 | 01:30 PM