Minister Dola Bala Veeranjaneya: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం...
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:05 PM
కూటమి ప్రభుత్వ హయాంలో హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్థులకు మంచి భోజన సదుపాయం అందిస్తున్నట్లు మంత్రి డోలా స్పష్టం చేశారు. పీ-4 ద్వారా పేదరికంలో ఉన్న వారికి ఆర్థికంగా తోడ్పాటు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.
గుంటూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు రూ. 143 కోట్లను జిల్లా సంక్షేమ హాస్టల్స్ ఆధునీకరణకు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో రూ. 106 కోట్లు సంక్షేమ హాస్టల్స్ నూతన భవనాలకు మంజూరు చేశారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో రూ. 20 కోట్లు కూడా సంక్షేమ హాస్టల్స్‌కి ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు..
కూటమి ప్రభుత్వ హయాంలో హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్థులకు మంచి భోజన సదుపాయం అందిస్తున్నట్లు మంత్రి డోలా స్పష్టం చేశారు. పీ-4 ద్వారా పేదరికంలో ఉన్న వారికి ఆర్థికంగా తోడ్పాటు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. గత వైసీపీ పాలకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్‌లు మూసేసి రాక్షసానందం పొందారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ. 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యం దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని మంత్రి డోలా ధీమా వ్యక్తం చేశారు.