జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:29 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో విధ్వంసం మాత్రమే చేసిందని ఆరోపణలు చేశారు.
విశాఖపట్నం, జనవరి25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Dola Bala Veeranjaneya Swamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో విధ్వంసం మాత్రమే చేసిందని ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో విశాఖలో భూములు దోచుకున్నారని విమర్శించారు. అందుకే ప్రజలు జగన్‌ను భరించలేక ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ కార్యవర్గం ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శిగా లోడగల కృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం మంత్రి డీబీవీ స్వామి మాట్లాడారు.
2029 ఎన్నికల్లోనూ కూటమి అధికారంలోకి రావాలి..
ఏపీలో ఇదే అభివృద్ధి కొనసాగలంటే 2029 ఎన్నికల్లోనూ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు. జగన్ కంటే పెద్ద చోర్ ఎవ్వరు లేరని విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని ఆరోపించారు. చెల్లి అస్తిని కొట్టేయలని చూశారని దెప్పిపొడిచారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని మంత్రి విమర్శించారు. గతంలో చంద్రబాబు విశాఖకు వస్తే ఎయిర్ పోర్టులోనే అడ్డుకొని ఇబ్బందులు పెట్టరని గుర్తు చేశారు. గతంలో విశాఖకు వస్తే పవన్ కల్యాణ్‌ను కూడా హోటల్ గదికే పరిమితం చేశారంటూ మంత్రి డోలా మండిపడ్డారు. తాము అలా కాదని.. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని... ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
జగన్ అనేక ఇబ్బందులు పెట్టారు..
యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలోనూ జగన్ అనేక ఇబ్బందులు పెట్టారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దుయ్యబట్టారు. తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని..ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం టీడీపీకి కంచుకోట అని వ్యాఖ్యానించారు. 2019లో విశాఖపట్నం ప్రజలు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు టీడీపీకి ఇచ్చారని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో కూటమికి పూర్తి మెజారిటీ ఇచ్చారని వెల్లడించారు. విశాఖ అంటే సీఎం చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పుకొచ్చారు. విశాఖ గ్లోబల్ సిటీగా ఎదుగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్
Read Latest AP News And Telugu News