Minister DBV Swamy VS YSRCP: లిక్కర్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టం.. జగన్ అండ్ కోకు మంత్రి డీబీవీ స్వామి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:07 PM
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. తిరుమలలోమత విశ్వాసాల గౌరవించి సంతకం పెట్టమంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదని నిలదీశారు. టీటీడీపైన బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.
తిరుపతి, ఆగస్టు22, (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కాంలో (AP Liquor Scam) ఎవరినీ వదిలిపెట్టమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (Minister Dola Bala Veeranjaneyaswamy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంలో రూ.350 కోట్లు అవినీతి జరిగిందని సిట్ అధికారులు తేల్చారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో ఎవరినీ వేధించలేదని, నిందితులను ఎవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. ఏపీ లిక్కర్ స్కాం సంబంధం ఉన్న వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు అధికారం కోసం అడ్డదారులు తొక్కారని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వంలో మంత్రులు చేసిన అవినీతిపై విచారణ జరుగుతోందని.. ఎవరినీ వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.
ఇవాళ(శుక్రవారం) తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొని మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. తిరుమలలో మత విశ్వాసాలను గౌరవించి సంతకం పెట్టమంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదని నిలదీశారు. టీటీడీపైన బురదజల్లే ప్రయత్నం జగన్ అండ్ కో మానుకోవాలని హితవు పలికారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.
వైసీపీ ఐదేళ్లలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. శ్రీవారితో పెట్టుకునే జగన్ 11సీట్లకు పడిపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు. పింక్ డైమండ్ ఉందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారని.. ఐదు సంవత్సరాలు ఏమీ చేశారని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తాను మాట్లాడిన మాటలకే ఎన్నికల్లో గెలవలేక పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ వైసీపీ నేతల చేష్టలనూ గమనిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.
దివ్యాంగుల సమస్యలను తమ ప్రభుత్వంలో పరిష్కరిస్తున్నామని నొక్కిచెప్పారు. ఏపీలో అన్ని సంక్షేమ హాస్టల్, గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచామని వెల్లడించారు. విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం జిల్లాలో శిక్షణ ప్రారంభించామని.. ఇవాళ తిరుపతిలో ప్రారంభించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అర్హత లేని వారు పెన్షన్ తీసుకొంటున్నారని చెప్పుకొచ్చారు. అర్హత ఉన్న దివ్యాంగులను పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telugu News