Share News

CM Chandrababu Meets Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Aug 22 , 2025 | 02:38 PM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

CM Chandrababu Meets  Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
CM Chandrababu Meets Nirmala Sitharaman

ఢిల్లీ, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) పర్యటిస్తున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలిసి ఏపీ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Sitharaman) సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు.


CM-Nara-Chandrababu-Naidu.jpg

ఏపీకి ఆర్థిక సహాయంపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌కు సీఎం వివరించారు. సాస్కితో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఏపీకి నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం ఎంపీలు పాల్గొన్నారు.

CM-Nara-Chandrababu-Naidu-2.jpg


ఈ వార్తలు కూడా చదవండి

విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు పవన్ కల్యాణ్..

లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ అదుపులో వైసీపీ మాజీ మంత్రి!

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2025 | 03:13 PM