BJP President Madhav: అరకు కాఫీకి మరింత ప్రోత్సాహం
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:37 AM
రిజనులు పండించే స్వచ్ఛమైన అరకు కాఫీని ప్రోత్సహించేందుకు మరింతగా కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
జీవో 3 పునరుద్ధరణకు చర్యలు: మాధవ్
పాడేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): గిరిజనులు పండించే స్వచ్ఛమైన అరకు కాఫీని ప్రోత్సహించేందుకు మరింతగా కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆయన గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికే అరకు కాఫీ ప్రపంచ ఖ్యాతి పొందింది. పార్లమెంటు ఆవరణలో స్టాల్‌ను ఏర్పాటు చేసి దేశంలోని ఎంపీలంతా అరకు కాఫీని రుచి చూసేలా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ కృషి చేశారు. కాఫీ సాగు విస్తరణ, గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు నూతన ప్రాజెక్టును మంజూరు చేశారు. వన్ డిస్ట్రిక్-వన్ ప్రొడక్ట్ నినాదంతో అరకు కాఫీకి మరింతగా ప్రాచుర్యం కల్పిస్తున్నాం. తోటల విస్తరణ, గిట్టుబాటు ధర, రైతులకు ప్రోత్సాహం వంటి చర్యలతో అరకు కాఫీని మరింత ఎత్తుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గిరిజనులకు సంబంధించిన జీవో 3 పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. గత జగన్ ప్రభుత్వం వాదనలను వినిపించని కారణంగానే జీవో 3 రద్దయ్యింది’ అని మాధవ్ తెలిపారు. అంతకు ముందు ఆయన పాడేరులో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, గంటందొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.