Share News

AP Liquor Case: లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ అదుపులో వైసీపీ మాజీ మంత్రి!

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:24 PM

ఏపీ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సిట్ అధికారులు నిందితులకు నిద్రలేకుండా చేస్తున్నారు. సిట్ దూకుడుతో కేసు జెట్ స్పీడ్‌లో ముందుకెళ్తుంది. తాజాగా కేసులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. ఆయనను విచారించి నిజానిజాలు రాబట్టానున్నట్లు అధికారులు తెలిపారు.

AP Liquor Case: లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ అదుపులో వైసీపీ మాజీ మంత్రి!

అమరావతి: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో సిట్ దూకుడు ప్రదర్శింస్తూ.. నిందితులను ఒక్కొక్కరిగా బయటకు లాగుతుంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో కూడా నారాయణ స్వామిని విచారణకు రావాలని సిట్ అధికారులు కోరినట్లు తెలిపారు. అయితే.. గతంలో వివిధ కారణాలు చెబుతూ.. విచారణకు గైర్హాజరు అవుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకోనే అవకాశం. అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్‌ ఆఫీస్‌కు తరలించనున్నట్లు సమాచారం. ఎక్సైజ్‌ పాలసీలో మార్పుల వెనుక ఉన్నవారి పాత్రపై సిట్‌ విచారణ చేయనున్న అధికారులు. లిక్కర్‌ పాలసీ ఆమోదానికి సంబంధించి ఆరా తీయనున్నట్లు సమాచారం. కాగా, లిక్కర్ కేసులో నారాయణ స్వామి పాత్ర కూడా కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు.


అయితే తాజాగా.. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కెసిరెడ్డికి చెందిన మరిన్ని విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కెసిరెడ్డి సహా పలువురు నిందితులు, పలు సంస్థలకు చెందిన రూ.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోల ద్వారా ఇప్పటికే అనుమతులు ఇచ్చింది.మరో రూ.13 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా పలు చోట్ల తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. వీటిని సీజ్‌ చేసేందుకు అనుమతించాలని సీఐడీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరడంతో అనుమతి మంజూరు చేసింది. కేసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.


ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను కూడా పలు దఫాలుగా కస్టడీలోకి తీసుకుని సిట్ విచారించింది. కెసిరెడ్డి రెడ్డితో పాటు జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహింతంగా వెలిగిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా విజయవాడ జైల్లో ఉన్నారు. ఈ నలుగురు చుట్టూనే మద్యం వ్యవహారం మొత్తం నడిచినట్లు ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని కూడా సిట్ అదుపులోకి తీసుకోనుంది. అదుపులోకి తీసుకుంటే.. నారాయణ స్వామి విచారణలో ఏం చెబుతారు అనేది కేసులో కీలకంగా మారనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శాంతిస్తున్న ఉగ్ర గోదావరి

ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..

Updated Date - Aug 22 , 2025 | 12:52 PM