Pawan Kalyan: విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు పవన్ కల్యాణ్..
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:01 AM
చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపచేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆయన జీవితం వెల కట్టలేని జీవిత పాఠమని పేర్కొన్నారు.
హైదరాబాద్: నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, ప్రజా జీవితం దాతృత్వంలో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని చంద్రబాబు తెలిపారు. మీ దాతృత్వం, అంకితభావంతో మీరు జీవితాలను స్పృశించడం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందంతో పాటు రాబోయేవి అన్ని అనేక చిరస్మరణీయ సంవత్సరాలు కావాలని కోరుకుంటున్నాని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తన శుభాకాంక్షలు తెలియజేశారు.
చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపచేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆయన జీవితం వెల కట్టలేని జీవిత పాఠమని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం తనకే కాదు.. తనాలాంటి ఎందరికో స్ఫూర్తి అని కీర్తించారు. చిరంజీవి కీర్తికి పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోనూ లేదని తెలిపారు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే తాను నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఆయన తమ్ముడిగా పుట్టడం అదృష్టమైతే.. ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవమని చెప్పుకొచ్చారు. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన 'విశ్వంభరుడు' అని కొనియాడారు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు భగవంతుడు సంపూర్ణ ఆయుస్సుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా అని పవన్ కల్యాణ్ తన విషెస్ తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న విశ్వంభర మూవీ టీమ్ అభిమానులకు కానుక ఇచ్చింది. మూవీ నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీ వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిరంజీవి ఓ వీడియాలో చెప్పుకొచ్చారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో.. విశ్వంభర ఒక సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది. విశ్వంభరతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో కూడా ఆయన మూవీస్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..