Home » Cinema News
తాను నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురువారం విడుదలవుతున్న సందర్భంగా.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతించాలని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హీరో నాని విజ్ఞప్తి చేశారు.
దొంగతనం చేశానని సోదరి రాధ ఫిర్యాదు చేయడంపై నటి అంబిక స్పందించారు. సొంత సోదరి తనపై దొంగతనం కేసు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దొంగతనం చేయలేదని అంబిక స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీలలో ‘గోంధల్’ చిత్రం చోటుదక్కించుకుంది. భారత్ తరఫున వివిధ భాషలకు చెందిన 33 చిత్రాలు పోటీ పడగా.. వీటన్నింటినీ ఈ మరాఠీ చిత్రం పక్కకు నెట్టింది.
షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పలువురు బాధితులు అంబర్‌పేట్ శివంరోడ్డులోని డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు.
ముంబైలో జరిగిన 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్‌కు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు
ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఒక హీరోపై అభిమానం వారిని దేశాల సరిహద్దులను దాటించింది. సినిమా విడుదలైన మొదటి రోజు, మొదటి షో చూడాలనే తపన ఏకంగా జపాన్ నుంచి నగరానికి పనిగట్టుకుని వచ్చేలా చేసింది.
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు.