Share News

Hero Ram Pothineni: అందుకే ఆయనంటే గౌరవం.. ఇప్పటికీ స్టూడెంట్‌ననే చెప్తా..

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:29 AM

నేను స్కూల్‌డేస్‌లో సిగ్గరిని. ఆ రోజుల్లోనే బోలెడు ప్రపోజల్స్‌ వచ్చాయి. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అన్నింట్లో చురుగ్గా పాల్గొనేవాడ్ని. స్కిట్స్‌ డైరెక్ట్‌ చేసేవాడిని, డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేసేవాడిని. స్కూల్‌ అయిపోయాక హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లేవాడిని. పొద్దున్న లేవగానే కుంగ్‌ ఫూ క్లాసులకి పరుగెట్టేవాడ్ని.

Hero Ram Pothineni: అందుకే ఆయనంటే గౌరవం.. ఇప్పటికీ స్టూడెంట్‌ననే చెప్తా..

స్టైల్‌లో స్పార్క్‌... డైలాగ్‌లో ఫైర్‌... డ్యాన్స్‌లో స్పీడ్‌... ఇదీ రామ్‌ పోతినేని (రాపో) మార్క్‌. ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌.. ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’గా మరోసారి ర్యాంపేజ్‌కు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా ‘రాపో’ పంచుకున్న కొన్ని ముచ్చట్లివి...

అందుకే ఆయనంటే గౌరవం..

నా గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. విజయవాడలో 1988లో జరిగిన కుల ఘర్షణల్లో మా కుటుంబం అప్పటివరకు సంపాదించినదంతా కోల్పోయింది. రాత్రికి రాత్రే జీరోకు వచ్చేశాం. ఇక విజయవాడలో ఉండడం సరికాదని చెన్నైకు వెళ్లిపోయాం. ఎంత కోల్పోయాననే దానికి ఉదాహరణ కూడా చెబుతాను. విజయవాడలో నా బొమ్మల కోసం ఒక పెద్ద గది ఉండేది. చెన్నైకు మారినప్పుడు మా ఇల్లు మొత్తం కలిసినా నా బొమ్మల గదిలో సగం కూడా ఉండేది కాదు. అన్ని కష్టాలు పడి నాన్న మమ్మల్ని పెంచారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం.


వారి ప్రేమకు ఫిదా..

book1.2.jpg

‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’లో ఓ హీరో వీరాభిమానిగా కనిపిస్తా. ఈ సందర్భంగా నన్ను అభిమానించేవారి గురించి కూడా చెప్పాలి. నేను నటించిన సినిమా హిట్‌ అవ్వాలని, నా అభిమాని ఒకరు మోకాళ్లపై నడుచుకుంటూ తిరుమలకొండ ఎక్కారని తెలిసి ఆశ్చర్యపోయా. ఇంకో అభిమాని అయితే తన బిడ్డకు నా సినిమా టైటిల్‌ను(‘స్కంధ’) పేరుగా పెట్టాడు. ఇలా నన్ను అభిమానించే ప్రతీ ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. వారి ఆనందం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధం.


నాతో నేను గడుపుతా...

book1.3.jpg

నాకు విహారయాత్రలంటే ఇష్టం. ఏ కాస్త విరామం దొరికినా ఫోన్‌ సిచ్చాఫ్‌ చేసి టూర్స్‌కు వెళ్తా. అక్కడ నా వంట నేనే చేసుకుంటా. నాతో నేను ఎక్కువ సమయం గడుపుతా. చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ చాలామందిని కలుస్తుంటా. అలా ఇతర ప్రాంతాల ప్రజలతో మాట్లాడినప్పుడే మన గురించి తెలుసుకోగలుగుతాం. బయటి దేశాలకు వెళ్తే ఇప్పటికీ స్టూడెంట్‌ననే చెప్పుకుంటా.

- నిర్మాత ఎమ్‌.ఎస్‌. రాజుగారు చెన్నై వచ్చి నాకు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ కథ చెప్పారు. కానీ అప్పుడు నా వయసు 13 ఏళ్లు కావడంతో వెనక్కి తగ్గారు.


- పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నంత సేపు ఏదో తెలియని కిక్కు వస్తుంది. ఆయన పేరు నా ఫోన్‌లో ‘గన్‌’ అని ఉంటుంది.

- ‘దేవదాసు’ సినిమా విడుదలై హిట్‌ అయ్యాక చిరంజీవిగారు నాకొక సలహా ఇచ్చారు. ‘ప్రతి సినిమా నీకు మొదటిదే. అలానే కష్టపడాలి’ అని చెప్పారు.

- ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ అంటే పిచ్చి. ఇప్పటిదాకా వందకు పైగా మొబైల్‌ ఫోన్స్‌ వాడి ఉంటా.

- పాత తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను మళ్లీమళ్లీ చూడటానికి ఇష్టపడతా.


book1.4.jpg

ఎన్ని ప్రపోజల్సో...

నేను స్కూల్‌డేస్‌లో సిగ్గరిని. ఆ రోజుల్లోనే బోలెడు ప్రపోజల్స్‌ వచ్చాయి. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అన్నింట్లో చురుగ్గా పాల్గొనేవాడ్ని. స్కిట్స్‌ డైరెక్ట్‌ చేసేవాడిని, డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేసేవాడిని. స్కూల్‌ అయిపోయాక హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లేవాడిని. పొద్దున్న లేవగానే కుంగ్‌ ఫూ క్లాసులకి పరుగెట్టేవాడ్ని. ఏదేమైనా ఆ రోజులు మాత్రం భలేగా ఉండేవి.


ఫటా ఫట్‌..

- సెలబ్రిటీ క్రష్‌: దీపికా పదుకొణె

- డ్రీమ్‌ కో స్టార్‌: అలియాభట్‌

- ఫోబియా: హైట్స్‌

- ఫేవరెట్‌ హాలిడే స్పాట్స్‌: గోవా, స్విట్జర్లాండ్‌

- డ్రీమ్‌ డెస్టినేషన్‌: జపాన్‌

- ఇష్టమైన కారు: రేంజ్‌ రోవర్‌

- ఇష్టమైన వంటకాలు: దక్షిణాదివన్నీ, థాయ్‌

Updated Date - Nov 23 , 2025 | 07:19 AM