-
-
Home » Mukhyaamshalu » Latest Viral Trending ap Telangana national to international today news live updates here kjr
-
BREAKING: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు
ABN , First Publish Date - Oct 27 , 2025 | 05:53 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 27, 2025 16:19 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో పోలీసుల అలర్ట్
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి బైండోవర్
శ్రీశైలంయాదవ్, సోదరుడు రమేష్‌యాదవ్ బైండోవర్
జూబ్లీహిల్స్‌లో 170 మంది రౌడీషీటర్ల బైండోవర్
బోరబండ పీఎస్‌లో అత్యధికంగా 74 మంది రౌడీషీటర్లు
ఎన్నికల సంఘం ఆదేశాలతో బైండోవర్ చేసిన పోలీసులు
-
Oct 27, 2025 16:17 IST
భారీ వర్షాలు..
ప.గో.: నరసాపురంలో మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు
నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో 16 పునరావాస కేంద్రాలు
15 వేల మందిని తరలించేందుకు అధికారుల సన్నాహాలు
-
Oct 27, 2025 13:53 IST
కానిస్టేబుల్ ఆత్మహత్య..
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామ శివారులో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం
రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన.. రేకులపల్లి జీవన్ రెడ్డి(37) పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య
జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జీవన్ రెడ్డి
కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు
-
Oct 27, 2025 13:51 IST
ఆటో డ్రైవర్‌పై కత్తులతో దాడి..
మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం...
బాంబే హోటల్ సమీపంలో ఆటో డ్రైవర్ ఝాన్సీరామ్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..
ఖైరతాబాద్‌లో ఆటో ఎక్కి రాణిగంజ్‌లో దిగాలని డ్రైవర్‌ను కోరిన గుర్తు తెలియని వ్యక్తులు...
డ్రైవర్ ఝాన్సీరామ్‌పై కత్తితో దాడి చేసి ఆటో, సెల్ ఫోన్ లాక్కెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు...
సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న మహంకాళి పోలీసులు.
-
Oct 27, 2025 12:50 IST
పరకామణి కేసులో.. హైకోర్టు కీలక ఉత్తర్వులు..
అమరావతి: పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి ఆదేశం డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఐవోగా నియమించాలని స్పష్టీకరణ
కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని ఆదేశం
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తుల పై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఏసీబీ ఆదేశం
రవికుమార్, కుటుంబ సభ్యుల స్థిర,చర ఆస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టీకరణ
వారికి సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరేవారికి ఏమైనా బదలాయించారా? అనే విషయం పై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశం
నివేదికను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ, సీఐడీకి స్పష్టీకరణ
-
Oct 27, 2025 12:41 IST
ఉప ఎన్నికపై.. కాంగ్రెస్ కీలక సమావేశం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై హోటల్ హరిత ప్లాజాలో కాంగ్రెస్ కీలక సమావేశం
ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం
హాజరైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంచార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్చొరేషన్ చైర్మన్లు, డీసీసీ నేతలు
రేపటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్
సీఎం ప్రచారం నేపథ్యంలో ఏర్పాట్లు , ప్రచార వ్యూహంపై చర్చ
-
Oct 27, 2025 11:29 IST
వీధి కుక్కలపై.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు..
ఢిల్లీ: దేశంలో వీధి కుక్కల ఉన్మాదం.. భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసింది: సుప్రీం కోర్టు
వీధి కుక్కలు మానవులపై జరిగే క్రూరత్వం గురించి ఏమంటారు?: పిటీషనర్లను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
కుక్కల దాడులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది: సుప్రీంకోర్టు
ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయి. మన దేశాన్ని విదేశీయులు తక్కువ చేసి మాట్లాడటానికి కుక్కల బెడద కూడా కారణం: జస్టిస్ విక్రమ్ నాథ్
వీధి కుక్కల సమస్యపై సుప్రీం నియమాలను అమలు చేసే చర్యలపై అఫిడవిట్‌లు సమర్పించని రాష్ట్రాల సి ఎస్ లకు సమ్మన్లు జారీ చేసిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలను సమన్లు జారీ చేసిన సుప్రీంకోర్టు
గత ఆగస్టు 22న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఆదేశాల అమలు వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
అఫిడవిట్ లను ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని కూడా సి ఎస్ లను ఆదేశించిన సుప్రీం ధర్మాసనం
-
Oct 27, 2025 10:20 IST
మరో బస్సుకు తప్పిన పెను ప్రమాదం
మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం జిల్లా కోమటి కుంట దగ్గర అదుపు తప్పి... ముళ్లకంపలోకి దూసుకెళ్లిన RVT ప్రైవేట్ ట్రావెల్ బస్సు..
ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు..
ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు.
-
Oct 27, 2025 08:40 IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై.. స్పీడ్ పెంచిన బీజేపీ..
ఇవాళ స్టేట్ ఆఫీస్‌లో అధ్యక్షుడు రాం చందర్ సమావేశం హాజరుకానున్న కిషన్ రెడ్డి , ఇతర ఎంపీలు , ఎమ్మెల్యేలు
వరుసగా ప్రచారం నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి
నగరంలోని కార్పొరేటర్లు , పార్టీ క్యాడర్‌ను ప్రచారంలోకి దింపాలని బీజేపీ నిర్జయం
-
Oct 27, 2025 07:59 IST
శ్రీశైల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
నంద్యాల: కార్తీకమాసం సోమవారం కావడంతో శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
గంగాధర మండపం వద్ద కార్తీకదీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటన్న మహిళలు
భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయం, సామూహిక, అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు..
భక్తులందరికీ అలంకార దర్శనం, స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం..
సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం..
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు.
-
Oct 27, 2025 07:23 IST
రద్దైన.. బంగ్లా, భారత్ మ్యాచ్..
మహిళల వన్డే ప్రపంచకప్: వర్షం కారణంగా బంగ్లా, భారత్ మ్యాచ్ రద్దు
-
Oct 27, 2025 06:31 IST
ఎస్‌ఐఆర్‌పై నేడు ఈసీ కీలక ప్రకటన
దేశవ్యాప్త ఎస్‌ఐఆర్‌పై నేడు ఈసీ కీలక ప్రకటన
సాయంత్రం 4.15 గంటలకు ఈసీ మీడియా సమావేశం
2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు.. 15 రాష్ట్రాల్లో తొలి విడత ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టే అవకాశం
-
Oct 27, 2025 05:53 IST
నేడు మద్యం దుకాణాలకు టెండర్లు
నిజామాబాద్ : లక్కీ డ్రా పద్దతిలో దుకాణాలు కేటాయించనున్న అధికారులు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలోని 102 మద్యం దుకాణాలకు 2,774 దరఖాస్తులు
టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.83.22 కోట్లు