-
-
Home » Mukhyaamshalu » latest Andhra pradesh Telangana national International breaking viral and trending news live updates on 14th December 2025 kjr
-
BREAKING: రేపు ఢిల్లీకి.. మంత్రి నారా లోకేష్
ABN , First Publish Date - Dec 14 , 2025 | 01:01 PM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 14, 2025 18:22 IST
రేపు ఢిల్లీకి.. మంత్రి నారా లోకేష్
రేపు ఢిల్లీకి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్..
కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలువనున్న లోకేష్..
రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్న లోకేష్..
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం..
రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్న లోకేష్..
ఎల్లుండి విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న లోకేష్.
-
Dec 14, 2025 17:23 IST
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్‌ను నియమించిన అధిష్టానం
ప్రస్తుతం బీహార్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబిన్.
-
Dec 14, 2025 15:12 IST
సిడ్నీలో కాల్పుల కలకలం
ఆస్ట్రేలియా: సిడ్నీలో కాల్పుల కలకలం
బాండీ బీచ్‌లో పర్యాటకులపై దుండగుల కాల్పులు..
10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు..
సెక్యూరిటీ దుస్తుల్లో వచ్చి దుండగుల కాల్పులు.
-
Dec 14, 2025 15:03 IST
ఎస్‌ఐపై వేటు..
పల్నాడు: చిలకలూరిపేట అర్బన్ ఎస్‌ఐ రహ్మతుల్లాపై వేటు..
ఇటీవల రోడ్డు ప్రమాదంలో యువకుల మృతికి కారణమైన ASI కుమారుడు..
కుమారుడికి ASI రహ్మతుల్లా సహకరించినట్లు తేలడంతో ఎస్పీ చర్యలు..
కుమారుడి ముఠా అక్రమ వసూళ్లకు సహకరించిన ఎస్‌ఐ రహ్మతుల్లా.
-
Dec 14, 2025 13:37 IST
సంతమాగులూరులో దారుణం..
బాపట్ల : సంతమాగులూరులో దారుణం..
భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి చంపిన భర్త వెంకటేశ్వర్లు..
మృతదేహాన్ని బైక్ పై పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి లొంగిపోయిన భర్త వెంకటేశ్వర్లు..
సంతమాగులూరు పోలీసుల అదుపులో నిందితుడు.
-
Dec 14, 2025 13:19 IST
నెల్లూరు మేయర్ రాజీనామా..
నెల్లూరు: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా..
నేడు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి రాజీనామా లేఖ అందజేయనున్న మేయర్..
మరో 4 రోజుల్లో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం..
ఆసక్తిగా మారిన నెల్లూరు మేయర్ రాజీనామా అంశం..
ఇప్పటికే కార్పొరేటర్లను క్యాంప్‌కి తరలించిన అధికార పార్టీ..
వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న కార్పొరేటర్లు..
52 మంది సభ్యుల్లో 42కు చేరిన టీడీపీ సభ్యుల బలం..
మేయర్ రాజీనామా ఆమోదిస్తే అవిశ్వాసం లేనట్టే..
ఈసీ అనుమతించాక నెల్లూరు మేయర్ ఎన్నిక.
-
Dec 14, 2025 13:05 IST
రేపు ఢిల్లీ పర్యటనకు మంత్రి లోకేష్
రేపు కేంద్రమంత్రులతో మంత్రి నారా లోకేష్ సమావేశం..
ఎల్లుండి ఢిల్లీ నుంచి విశాఖకు మంత్రి లోకేష్..
విశాఖలో GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభించనున్న లోకేష్.
-
Dec 14, 2025 13:03 IST
రైలు నుంచి పొగలు..
కాకినాడ: అన్నవరం రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి పొగలు
సిల్ఘటన్ నుంచి తాంబరం వెళ్తున్న ట్రైన్
అన్నవరం రాగానే రైలు ఎస్ 7 బోగి నుంచి ఎయిర్ బ్రేక్ నుంచి గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా వ్యాపించిన పొగ..
భయాందోళనకు గురై ఫ్లాట్ ఫారం పైకి దూకేసిన ప్రయాణికులు..
కాసేపటికీ మర్మమ్మతులు చేయడంతో బయలుదేరిన ట్రైన్.