-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh Latest Breaking Viral news to national and international on 5th nov 2025 know here kjr
-
BREAKING: గ్రూప్-1పై ఏపీ హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - Nov 05 , 2025 | 07:30 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 05, 2025 20:19 IST
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్,..
సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, బుమ్రా,..
వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్‌రెడ్డి, సిరాజ్, కులదీప్, ఆకాశ్ దీప్
కోల్‌కతాలో ఈనెల 14 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
-
Nov 05, 2025 20:19 IST
ఎంపీ గురుమూర్తి పిల్‌ను కొట్టేసిన హైకోర్టు
వీఆర్‌లో ఉన్న పోలీస్ అధికారుల జీతాల పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి పిల్‌ను కొట్టేసిన హైకోర్టు
పిల్‌పై విచారించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం తామిక్కడ ఉన్నది పోలీస్ శాఖను నడిపించడానికి కాదు: హైకోర్టు
జీతాలు రాకుంటే బాధిత పోలీసులే కోర్టును ఆశ్రయించవచ్చు కదా?: హైకోర్టు
వారి తరపున ఎంపీ పిల్ దాఖలు చేయడం ఏంటి?: హైకోర్టు
-
Nov 05, 2025 20:17 IST
అమరావతి: ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష
యూనివర్సిటీలకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్‌ను రూపొందించాలి: లోకేష్
ఉన్నత విద్యలో పాఠ్యప్రణాళికను ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలి: లోకేష్
ఐటీఐలు, యూనివర్సిటీలను నవంబర్‌లోగా పరిశ్రమలతో అనుసంధించాలి: లోకేష్
కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను.. సమర్థంగా రూపొందించాలి: మంత్రి లోకేష్
యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో.. 100శాతం ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలి: లోకేష్
-
Nov 05, 2025 20:16 IST
గ్రూప్-1పై ఏపీ హైకోర్టులో విచారణ
గ్రూప్-1 మెయిన్స్‌లో అవకతవకలు జరిగాయన్న పిటిషనర్
డిజిటల్, మాన్యువల్ ఆన్సర్ షీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.. కోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
డిజిటల్ వాల్యుయేషన్‌కు సంబంధించి ఆన్సర్ సీట్లను.. స్కాన్ చేసి డిస్క్ కూడా అందిస్తామన్న ప్రభుత్వం
ఏపీపీఎస్సీ అధికారులు, రిజిస్ట్రార్ జ్యూడీషియల్ కలిసి.. ఆన్సర్ షీట్లు పరిశీలించి జాబితా తయారు చేయాలని ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు
-
Nov 05, 2025 20:16 IST
కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
రూ.74,000 అదనంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు
ప్రముఖ డాక్యుమెంట్ రైటర్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు
గతంలో కూడా ఆ డాక్యుమెంట్ రైటర్‌పై ఆరోపణలు
సబ్ రిజిస్టార్ కార్యాలయం సమీపంలోనే డాక్యుమెంట్ రైటర్ కార్యాలయం
ఫోన్ పేతో నగదు చెల్లింపులు చేసినట్లు గుర్తింపు
-
Nov 05, 2025 17:34 IST
మరో ఎన్‌కౌంటర్..
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా తాళ్లగూడెంలో ఎన్‌కౌంటర్
బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
-
Nov 05, 2025 17:34 IST
జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు ఖాయం: తలసాని శ్రీనివాస్
జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామన్న నిరాశ, నిస్పృహతోనే.. సీఎం రేవంత్ దూషణలకు పాల్పడుతున్నారు: తలసాని శ్రీనివాస్
ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారు: తలసాని
-
Nov 05, 2025 17:33 IST
రౌడీ షీటర్ల మధ్య గ్యాంగ్ వార్..
హైదరాబాద్: జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ల మధ్య గ్యాంగ్ వార్
బస్టాండ్ దగ్గర కత్తులతో దాడులు చేసుకున్న రౌడీ షీటర్లు
రోషన్‌పై కత్తితో దాడిచేసిన బాల్‌రెడ్డి, తీవ్రగాయాలు
రోషన్ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Nov 05, 2025 16:31 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సీఎం రేవంత్ సిద్ధమా?: కేటీఆర్
అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే చర్చకు రెడీ: కేటీఆర్
ఓటమి తప్పదని భావించే సీఎం వ్యక్తిగత దూషణ చేస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్‌లో గన్, డ్రగ్ కల్చర్ పెరిగింది: కేటీఆర్
అండర్ పాస్‌లు, ప్లైఓవర్లు కేసీఆర్ హాయాంలోనే నిర్మించాం: కేటీఆర్
కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారో చెప్పాలి: కేటీఆర్
మీ భాషలోనే మాకు సమాధానం చెప్పడం వచ్చు.. కానీ అలాంటి మాటలు వద్దని కేసీఆర్ చెప్పారు: కేటీఆర్
జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్
BRS హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక
రెండేళ్లలో ఒక్క కొత్త స్వచ్ఛ ఆటో అయినా ఇచ్చారా?: కేటీఆర్
మున్సిపల్, హోంశాఖ మంత్రిగా రేవంత్ పూర్తి వైఫల్యం: కేటీఆర్
BRS హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా చేస్తే.. రెండేళ్లలో కాంగ్రెస్ మురికి కూలంగా మార్చింది: కేటీఆర్
-
Nov 05, 2025 16:29 IST
ఏసీబీ దాడులు..
ఏపీలో పలు జిల్లాల్లో ACB దాడులు
విశాఖ మధురవాడ, అన్నమయ్య జిల్లా రాజంపేట, ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల్లో ACB తనిఖీలు
అవినీతి ఆరోపణలతో ACB అధికారుల తనిఖీలు
-
Nov 05, 2025 14:56 IST
చెట్టును ఢీకొన్న కారు.. నలుగురికి తీవ్ర గాయాలు
చేవెళ్ల : బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిలో మరో రోడ్డు ప్రమాదం
మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద హైదరాబాద్ నుండి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు మర్రి చెట్టు కి ఢీ
రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల మర్రిచెట్టును ఢీకొన్న కారు
కారులో ఐదుగురు యువకులు ఉండగా.. నలుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
-
Nov 05, 2025 13:33 IST
కనకదుర్గమ్మను దర్శించుకున్న నారా రోహిత్ దంపతులు
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న నారా రోహిత్ దంపతులు
ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన నారా రోహిత్, శిరీష
నారా రోహిత్ దంపతులకు స్వాగతం పలికిన దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యులు
అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులతో ఆశీర్వచనం
నారా రోహిత్ దంపతులకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేసిన ఆలయ ఈవో శీనూ నాయక్, చైర్మన్ రాధాకృష్ణ
-
Nov 05, 2025 13:18 IST
రేపు అమరావతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
రేపు ఉదయం లండన్ పర్యటన ముగించుకుని అమరావతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు, పోలీసు, అటవీ శాఖ అధికారులతో డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై రేపు సమావేశం
సచివాలయంలో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సమావేశం
ఐదో బ్లాక్‌లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం కానున్న సీఎం
అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు ఈ సమావేశానికి వర్చువల్ గా హాజరు కావాలని ఆదేశం
-
Nov 05, 2025 11:51 IST
పట్టాలు తప్పిన మోనో రైలు
ముంబైలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మోనో రైలు
ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన భారీ ప్రమాదం
వడాలా-జీటీబీ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఘటన
-
Nov 05, 2025 11:27 IST
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి 65 పటాన్ చెరు మండలం ముత్తంగి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
ముందు ఉన్న కారును తప్పించబోయి బ్రేక్ ఫెయిలై డివైడర్ పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంబానికి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
బస్సులో 20 మంది ప్రయాణికులు
మేడ్చల్ డిపోకు చెందిన బస్సు
మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తుండగా ప్రమాదం
ఎవరికీగాయాలు కాలేదు.. తప్పిన పెను ప్రమాదం
సంఘటన స్థలానికి చేరుకున్న పటాన్‌చెరు పోలీసులు
బస్సుకు సాంకేతిక లోపాలతోనే ప్రమాదం
-
Nov 05, 2025 11:18 IST
ఢీకొని ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం
రైలు ఢీకొని ఆరుగురు మృతి
రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం
మీర్జాపూర్ చునార్ జంక్షన్‌లో ఘటన
ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు
-
Nov 05, 2025 11:06 IST
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
బొలెరో-కారు ఢీ, నలుగురు తెలంగాణ వాసులు మృతి
మృతులు నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (26)
గణగాపూర్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
Nov 05, 2025 10:07 IST
గంజాయి విక్రయిస్తున్న యువతి అరెస్ట్
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న యువతి
మరో ముగ్గురి అరెస్ట్
కాకినాడ నుండి డ్రై గంజాయి తీసుకొచ్చిన ముగ్గురు
ముగ్గురిలో జ్యోతి అనే ఒక యువతి
కాకినాడ నుండి గంజాయ్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు యత్నించిన జ్యోతి, అజయ్, రమేష్‌లు...
కేపీహెచ్‌బీలోని ఓ హోటల్ గదిలో ఉండగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు..
6 కేజీల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం.
-
Nov 05, 2025 09:47 IST
నేటితో వెనుదిరిగిన రుతుపవనాలు
హైదరాబాద్ : తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన వెదర్‌మాన్, వాతావరణ శాస్త్రవేత్త బాలాజీ.
నేటితో తెలంగాణలో వర్షాకాలం ముగింపు.
నేడు హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలకు వర్షపాతం
రేపటి నుంచి చలికాలం మొదలవుతుందని ట్వీట్.
ఇప్పటికే తెలంగాణలో వెనుదిరిగిన రుతుపవనాలు
అల్పపీడణాల కారణంగా వరుసగా వర్షాలు.
ఈ ఏడాది వర్షాలతో బెంబేలెత్తిన తెలంగాణ.
-
Nov 05, 2025 08:44 IST
నేడు గిరి ప్రదక్షిణ
కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుడి గిరి ప్రదక్షిణ
గిరిప్రదక్షిణలో పాల్గొననున్న రెండు లక్షల మంది భక్తులు
సుమారు 8.5 కిలోమీటర్ల గిరియాత్ర
ఉదయం 8 గంటలకు పల్లకీసేవ, మధ్యాహ్నం
2 గంటలకు సత్యరథంతో గిరిప్రదక్షిణ
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అప్రమత్తం
-
Nov 05, 2025 08:44 IST
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్‌దాని విజయం
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన వామపక్ష నేత మమ్‌దాని
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న మమ్‌దాని విక్టరీ
మేయర్ ఎన్నికల్లో డెముక్రాట్ అభ్యర్థి ఆండ్రూ కుమోపై మమ్‌దాని విజయం
-
Nov 05, 2025 08:43 IST
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచిలువ ప్రత్యక్షం
నిన్న అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా వీడియో తీసిన భక్తులు
కొండచిలువ రోడ్డు దాటడం చూసి వాహనాలను ఆపిన భక్తులు
రోడ్డు దాటిన తర్వాత యథావిధిగా కార్లలో తిరుమలకు వెళ్లిన భక్తులు
-
Nov 05, 2025 08:34 IST
అమెరికాలో ట్రంప్ విధానాలకు ఎదురుదెబ్బ
గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమి
వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమి
వర్జీనియా గవర్నర్‌గా డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్
వర్జీనియా తొలి మహిళా గవర్నర్‌గా అబిగైల్ స్నాన్‌బర్గర్ రికార్డు
సిన్సినాటి మేయర్‌గా డెమొక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలుపు
అట్లాంటా మేయర్‌గా డెమొక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నిక
పిట్స్‌బర్గ్ మేయర్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం