MLA Raja Singh: శీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడే బాధ్యత మీదే
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:32 AM
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌దేనని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ‘నేను అభ్యర్థిస్తున్నాను.. నేను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఇక్కడ కూడా అదే తప్పు చేయకండి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ, ఇతర మతాల వారిని వెంటనే సున్నిపేట ప్రాంతానికి బదిలీ చేయాలి’ అని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.
- ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ వినతి
హైదరాబాద్ సిటీ: శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Andhra Pradesh Chief Minister Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌దేనని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) పేర్కొన్నారు. ‘నేను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఇక్కడ కూడా అదే తప్పు చేయకండి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ, ఇతర మతాల వారిని వెంటనే సున్నిపేట ప్రాంతానికి బదిలీ చేయాలి’ అని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.

పవిత్ర స్థలమైన శ్రీశైలాన్ని అపవిత్రం చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శ్రీశైలం(Srisailam) ప్రాంతంలోని దాదాపు అన్ని దుకాణాలను హిందువేతరులు ఆక్రమించారని, అక్కడి నుంచి వారినిఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. అలాగే అటవీ శాఖ అధికారుల పైన దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారని, ఇది మంచి నిర్ణయమని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..
Read Latest Telangana News and National News