Home » MLA Raja Singh
హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులెవరూ రాజమౌళి సినిమాలు చూడొద్దని పిలుపునిచ్చారు. ఇలాంటి దర్శకులపైన ఫిర్యాదు చేయండి! ఇలాంటి వారిని జైల్లో వేస్తేనే ..
భగవద్గీతపై ఎమ్మెల్యే ఎమ్.ఎస్.రాజు వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. భగవద్గీతతో ప్రయోజనం లేదన్న అతనికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
'ఇవ్వాలా బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపట ఎక్కడున్నారో కొద్ది చెప్తారా కిషన్ రెడ్డి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదు. నేను హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతాను.'
ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం వద్ద అన్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌దేనని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ‘నేను అభ్యర్థిస్తున్నాను.. నేను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఇక్కడ కూడా అదే తప్పు చేయకండి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ, ఇతర మతాల వారిని వెంటనే సున్నిపేట ప్రాంతానికి బదిలీ చేయాలి’ అని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని బీజేపీ గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ కోరారు. శుక్రవారం మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Raja Singh statement: తాను బీజేపీ తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనతో కొంతమంది ఆట ఆడుతున్నారని.. తాను వేరే పార్టీలోకి వెళ్లనన్న విషయం వాళ్లకు తెలుసునని.. అందుకే వాళ్లు తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చుననే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా..? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా..? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.