Share News

MLA Raja Singh: ఆలయాలను అపవిత్రం చేస్తే రేవంత్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..

ABN , Publish Date - Jan 14 , 2026 | 07:41 AM

ఆలయాలను అపవిత్రం చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడి, మాజీమంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదంటూ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయన్నారు.

MLA Raja Singh: ఆలయాలను అపవిత్రం చేస్తే రేవంత్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..

- ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్: హిందూ మతంపై, హిందూ ఆలయాలపై దాడులు, అపవిత్ర పనులు జరుగుతుంటే హిందువులు స్పందించరా అని ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Raja Singh) ప్రశ్నించారు. మల్కాజిగిరిలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ఇటీవల జరిగిన ఓ అపవిత్ర సంఘటనపై ఆయన మంగళవారం కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ నిత్యం హిందూ దేవాలయాలపై హిందువులపై జరుగుతున్న అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.


city3.2.jpg

తాను హిందువునేనని తనకు దేవుళ్లంటే ప్రేమ ఉందని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడి, కేటీఆర్‌(CM Revanth Reddy, KTR) స్పందించారా అంటూ ప్రశ్నించారు. హిందువుల ఆలయాల వద్దకే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు క్యానం రాజ్యలక్ష్మి, సునీతచంద్రశేఖర్‌యాదవ్‌, ఆలయ కమిటీ ప్రతినిధి మండల రాధ కృష్ణాయాదవ్‌, బక్కనాగరాజు లతో పాటు పలువురు హిందువులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హిందువులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2026 | 07:41 AM