Home » Goshamahal
హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం వద్ద అన్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని బీజేపీ గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ కోరారు. శుక్రవారం మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ కార్యాలయం వద్ద పాకిస్థాన్ జెండా స్టిక్కర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. అయితే.. ఎమ్మెల్యే మాత్రం తిరుపతి వెళ్లారు. కార్యాలయం వద్ద చెప్పులు విడిచే స్థలంలో పాకిస్థాన్ జెండా స్టిక్కర్లను అతికించడం కలకలం సృష్టించింది.
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్‌బోర్డు బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఎలాంటి షరతు లేకుండా మద్దతు ప్రకటించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మంచి వాతావరణం వచ్చింది, ప్రధాని మోదీ మంచి నిర్ణయం తీసుకుని 14 మార్పులు కూడా చేశారన్నారు.
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలనానికి తెరలేపారు. బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికే దారితీశాయి. బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అనడం గమనార్హం.
తెలంగాణలో అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవడానికి ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Raja Singh) ఎక్స్ ట్విటర్‌లో డిమాండ్ చేశారు.
Goshamahal Nala Collapse: గోషామహల్ చాక్నవాడిలో ఓ నాలా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలియడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కుంగిపోయిన నాలాను అధికారులు పరిశీలించారు.
Osmania Hospital: నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్(Goshamahal MLA T. Rajasingh) విమర్శించారు. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్లు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు.