Share News

MLA Raja Singh: తిరుపతిలో ‘తబ్లిక్‌ ఇస్తామా’ రద్దు చేయాలి

ABN , Publish Date - Sep 05 , 2025 | 08:42 AM

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం వద్ద అన్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు.

MLA Raja Singh: తిరుపతిలో ‘తబ్లిక్‌ ఇస్తామా’ రద్దు చేయాలి

- ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ వినతి

హైదరాబాద్‌ సిటీ: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం వద్ద అన్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Raja Singh) విజ్ఞప్తి చేశారు. తబ్లిక్‌ జామాద్‌ ఆధ్వర్యంలో ఈనెల 13, 14 తేదీల్లో తిరుపతిలో తబ్లిక్‌ ఇస్తామా కార్యక్రమం ఏర్పాటు చేశారని, పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారని వివరించారు.


city5.2.jpg

తబ్లిక్‌ జామాద్‌ సంస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించందని, ఇక్కడ ఎలా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తబ్లిక్‌ ఇస్తామా కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంస్థల కార్యక్రమాలు దేశంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా(Union Home Minister Amisha)ను ఆయన కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 08:42 AM