MLA Bhanu Prakash: ఆ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలపండి
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:13 PM
నగరి నియోజకవర్గంలోని నగరి, విజయపురం, నిండ్ర మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన కలిశారు.
- సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే భానుప్రకాష్ వినతి
పుత్తూరు(తిరుపతి): నగరి నియోజకవర్గంలోని నగరి, విజయపురం, నిండ్ర(Nagari, Vijayapuram, Nidra) మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్(MLA Bhanu Prakash) సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మరమగ్గ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేయడంపై నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియ జేశారు. అనంతరం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చంద్రబాబుకు వివరించారు.

కోసలనగరం పారిశ్రామిక కేంద్రం అభివృద్ధికి చర్యలు తీసుకుని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించి పుత్తూరులో ఉన్న వేణుగోపాల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సంబంధించిన వినతులు అందజేశారు. స్పందించిన సీఎం నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..
Read Latest Telangana News and National News