Veeranjaneya Swamy Criticizes Jagan: యాగి చేయాలనేదే జగన్ ఆలోచన.. మంత్రి ఫైర్
ABN , Publish Date - Oct 04 , 2025 | 02:39 PM
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు పీపీకి ప్రైవేట్ పరానికి అర్థం తెలియడం లేదని విమర్శించారు.
విశాఖపట్నం, అక్టోబర్ 4: విశాఖ వీఎంఆర్‌డీఏ ఏరినాలో ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సేవా పథకం కింద ఈరోజు రూ. 15000 అందిస్తున్నామని తెలిపారు. ఆటో సోదరులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం 15 వేల రూపాయలను అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే ప్రభుత్వమని స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు పీపీకి ప్రైవేట్ పరానికి అర్థం తెలియడం లేదని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంలో కేవలం 18 శాతం మాత్రమే మెడికల్ కాలేజ్ పనులు జరిగాయని.. వాటితో మెడికల్ కాలేజి నిర్వహణ మొదలుపెట్టలేమని చెప్పారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం అయిపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రారని.. ప్రజా సమస్యలు పట్టించుకోరని.. ఏదో రకంగా యాగి చేయాలనే ఆలోచన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని.. అయినా వారి మనస్తత్వాలు, వారి వ్యవహారాల ధోరణి మారలేదంటూ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి..
దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం..
మహిళలను కించపర్చొద్దు... ఏదైనా ఆడవారి తర్వాతే..
Read Latest AP News And Telugu News