Minister Nimmala Ramanaidu: దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం..
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:30 PM
ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అర్హులైన డ్రైవర్లందరికీ ఏడాదికి 15వేల చొప్పున ఆర్దిక సాయం అందజేస్తామన్నారు.
రాజమండ్రి, అక్టోబర్ 4: రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమండ్రి కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్లతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) పాలాభిషేకం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు చేపట్టిన ర్యాలీలో మంత్రి కూడా ఆటో నడిపారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఇచ్చిందన్నారు.
ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన డ్రైవర్లందరికీ ఏడాదికి 15వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా రూ. 436 కోట్లు జమ అయ్యాయి. గత వైసీపీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇస్తే, కూటమి ప్రభుత్వం 50 శాతం పెంచి రూ.15 వేలు అందిస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1,000 కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టి సాఫీగా ప్రయాణం సాగేలా చేసిందని చెప్పారు. పాతవాహనాలపై గత ప్రభుత్వంలో 20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను కుదించి, రూ.3 వేలకు తగ్గించి వాహనదారులకు కూటమి ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 11,915 మంది వాహనదారులకు గానూ రూ 17.87 కోట్లు అందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అధికారుల దురాశ.. పల్టీ కొట్టిన క్రేన్
ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు..
Read Latest AP News And Telugu News