Indrakeeladri Bhavani Rush: ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు..
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:57 AM
ఆదివారం కావడంతో తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ, అక్టోబర్ 4: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి. అయినప్పటికీ భవానీ భక్తుల రద్దీ ఇంకా ఉంది. భవానీల తాకిడి అధికంగా ఉండటంతో కొండపైకి ఏ వాహనాన్ని పోలీసులు అనుమితించడం లేదు. వీఎంసీ వద్ద హోల్డింగ్ పాయింట్లు చేసి భక్తులను నిలిపి కొంత కొంత మందిగా వదులుతున్నారు. గేటు తీయగానే పరిగెత్తుకుంటూ వస్తున్నారు భవానీలు. ఊహించని రీతిలో భవానీ భక్తులు అమ్మ ఆలయానికి తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వన్ టౌన్ సీఏ గురు ప్రకాష్ మాట్లాడుతూ.. 11 రోజుల పాటు దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయన్నారు. నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు అమ్మవారి పుట్టిల్లుగా భావించి పోలీస్ స్టేషన్‌కు రావడం ఆనవాయితీ అని తెలిపారు. అమ్మవారికి జరిపించవలసిన పూజా కార్యక్రమాలు జరిపించి తిరిగి అమ్మవారిని ఎద స్థానానికి పంపించేస్తామని చెప్పారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఏగా పని చేయడం తన పూర్వజన్మ సుకృతమని.. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి భాగ్యం ఎవరికో గాని దక్కదని చెప్పారు. అమ్మవారిని తమ పోలీస్ స్టేషన్‌లో ప్రతిష్టాపన చేసి పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముగించామన్నారు. 15 రోజుల పాటు 4500 మంది పోలీసులు నిర్విఘ్నంగా విధులు నిర్వహించారన్నారు. వీకెండ్స్ కావడంతో భవానిలో తాకిడి ఎక్కువగా ఉండడంతో 4500 మంది పోలీసులు మరో మూడు రోజులు పాటు విధులు నిర్వహించనున్నారని సీఏ గురు ప్రకాష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. హైడ్రా కూల్చివేతలు మళ్లీ..
అధికారుల దురాశ.. పల్టీ కొట్టిన క్రేన్
Read Latest AP News And Telugu News