Home » Vijayawada Durga Temple
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈఏడాది 25 లక్షల మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఈ ఏడాది దేవీ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. ఈ మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుకున్నారు.
ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడటం కలకలం రేపింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే రాకపోకలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రముఖులను విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తూ నగరానికి మరింత జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రికీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఈజీ పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రారంభించారు.
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును వారం రోజుల పాటు మూసివేయనున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఘాట్ రోడ్‌కు మరమ్మతు పనులు చేపట్టారు.
దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ మేరకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సహా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఘాట్ రోడ్ మరమ్మతు పనులు చేపట్టనున్నారు అధికారులు.
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. మొత్తం 25 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.