Share News

Balakrishna Visited Durga Temple: దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య

ABN , Publish Date - Sep 27 , 2025 | 09:32 AM

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు బాలయ్య. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Balakrishna Visited Durga Temple: దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య
Balakrishna Visited Durga Temple

విజయవాడ, సెప్టెంబర్ 27: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) ఈరోజు (శనివారం) ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను బాలయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న హీరో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.


తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారన్నారు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారన్నారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో భారీగా IAS, IPSల బదిలీలు.. నగర సీపీగా సజ్జనార్

ఆరవ రోజుకు దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 09:36 AM